: దామోదర్ జోషి మృతి పట్ల సంతాపం తెలిపిన కేవీపీ
సమైక్యాంధ్ర ఉద్యమనేత, ఏపీఎన్జీవో నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు దామోదర్ జోషి మృతి పట్ల రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు సంతాపం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు దామోదర్ చేసిన కృషి వెలకట్టలేనిదని కేవీపీ అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం సీమాంధ్రులంతా పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని చెప్పారు. దామోదర్ జోషి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.