: షూ విసురు.. ఆమ్ ఆద్మీ పార్టీ టికెట్ పట్టు!
కేంద్ర మంత్రి చిదంబరంపై షూ విసిరిన ఒక సాహసికుడికి ఆమ్ ఆద్మీ పార్టీ లోక్ సభ టికెట్ ఇచ్చింది. జర్నైల్ సింగ్ ప్రస్తుతం మాజీ జర్నలిస్టు. ఈయన 2009 ఏప్రిల్లో ఒక జాతీయ పత్రికలో విలేకరిగా పనిచేస్తున్నప్పుడు చిదంబరం విలేకరుల సమావేశంలో పాల్గొన్నాడు. ఆ సమావేశంలో చిదంబరం మాట్లాడుతూ.. తన స్నేహితులైన కాంగ్రెస్ నేతలు సజ్జన్ కుమార్, జగదీష్ టైట్లర్ సిక్కు అల్లర్ల కేసు నుంచి బయటపడినందుకు సంతోషంగా ఉందన్నారు. ఆ మాటలు జర్నైల్ సింగ్ కు కోపం తెప్పించాయి. చిదంబరంపై షూ విసిరి నిరసన వ్యక్తం చేశాడు. అదే తనకు పెద్ద అర్హతగా భావించాడేమో 'నాకూ టికెట్ ఇవ్వండి' అని సాధించుకున్నాడు. 'ఆమ్ ఆద్మీ తరఫున పశ్చిమ ఢిల్లీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నాను. అది నాకు లభించింది' అంటూ జర్నైల్ సింగ్ సంతోషం వ్యక్తం చేశారు.