: ఢిల్లీలో సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు 15 వేల మంది
ఏపీఎన్జీవోల ఆధ్వర్యంలో ఢిల్లీలోని రాంలీలా మైదానంలో జరగనున్న 'సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ'కు వేలాదిగా సమైక్యవాదులు హాజరవుతున్నారు. ప్రత్యేక రైళ్లలో ఢిల్లీకి చేరుకుంటున్న వారి సంఖ్య దాదాపు 15 వేల మంది వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. వేలాదిగా చేరుకుంటున్న సమైక్యవాదులతో శీతల ఢిల్లీ నగరం వేడెక్కింది. ఈరోజు, రేపు (17,18) జరిగే సభకు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అనుమతి లభించింది. మొదటి రోజు రాత్రి రాంలీలా మైదానంలోనే నిద్రించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆహార పొట్లాలు, మంచినీరు, మరుగుదొడ్లు సమకూరుస్తున్నారు.