: రూ.10వేలున్నా తెలియపరచాల్సిందే: కస్టమ్స్ కొత్త నిబంధన


విదేశాల నుంచి భారత్ కు తిరిగి వచ్చే ప్రయాణికులు తమ వద్ద పరిమితికి మించి ఆభరణాలతోపాటు రూ.10వేల కంటే ఎక్కువ డబ్బున్నా ఇమ్మిగ్రేషన్ అధికారులకు తెలియపర్చాలి. మార్చి 1వ తేదీ నుంచి కొత్తగా అమలులోకి రానున్న కస్టమ్స్ నిబంధనల ప్రకారం ఇది తప్పనిసరి చేశారు. దీంతోపాటు హ్యాండ్ బ్యాగ్స్ సహా వారు ఎన్ని బ్యాగ్ లు తెస్తున్నారో అన్ని వివరాలను తెలియపరచాలని కొత్త నిబంధనలు రూపొందించారు. ఈ కొత్త చట్టం ప్రకారం భారతీయ పౌరులు దేశం నుంచి బయటకు వెళ్లేటప్పుడు తప్ప తిరిగివచ్చేటప్పుడు ఇమ్మిగ్రేషన్ ఫారం పూర్తి చేయాల్సిన పనిలేదు. అయితే భారతదేశానికి వచ్చే ప్రయాణికులు 'ఇండియన్ కస్టమ్స్ డిక్లరేషన్ ఫారం'ను పూర్తి చేయాల్సి ఉంటుంది. కాగా ప్రయాణానికి ఆరురోజుల ముందు ఏ దేశాల్లోనైనా పర్యటిస్తే ఆ వివరాలు చెప్పాలని చట్టంలో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News