: ఆ ఏనుగు ఎంత క్రూరంగా వ్యవహరించింది?
ఏనుగును దైవ సమానంగా భావిస్తారు కొందరు. కానీ, మనం ఇప్పుడు తెలుసుకుంటున్నది ఒక రాక్షస ఏనుగు గురించి. తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా బోలువంపత్తి అటవీ ప్రాంతం. ఆ అడవికి సమీపంలోనే ఒక గ్రామం. ఆ గ్రామానికి చెందిన 55 ఏళ్ల పెద్దాయన ఆదివారం తన పశువులను మేత కోసం అడవి సమీపానికి తోలుకెళ్లాడు. అవి గడ్డి మేస్తున్నాయి. అక్కడి నుంచి 100 మీటర్లు అలా వెళితే అడవి మొదలవుతుంది.
ఉన్నట్లుండి ఓ పెద్ద ఏనుగు అతడి దగ్గరగా వచ్చింది. కానీ, అతడు వెనక్కి తిరిగి చూసుకోలేదు. వినికిడి శక్తి దెబ్బతిని పోవడంతో కనీసం ఏనుగు అరుపులు, అలికిడి కూడా అతడి చెవిన పడలేదు. ఏనుగు వేగంగా రానే వచ్చింది. తొండంతో అతడిని గట్టిగా పైకిలేపి నేలకేసి కొట్టి కాలితో తొక్కి చంపేసింది. అటుగా వచ్చిన గ్రామస్థులు ఏనుగును..అక్కడే రక్తపు మడుగులో పడి ఉన్న తమ గ్రామస్థుడిని చూశారు. పోలీసులకు సమాచారం అందించారు. కొంతసేపు అక్కడే ఉన్న ఆ దయలేని ఏనుగు నెమ్మదిగా అడవిలోకి వెళ్లిపోయింది. తమిళనాడులో ఇలాంటి ఘటనలు సాధారణమే. ఏనుగుల ప్రాణాలను దయలేకుండా తీసే స్మగ్లర్లు ఉన్నప్పుడు.. అవి ప్రాణభయంతో అంత రాక్షసంగా వ్యవహరించడంలో తప్పేముంది?