: కావూరి నివాసంలో ముగిసిన సీమాంధ్ర మంత్రుల సమావేశం


కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు నివాసంలో సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీల సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా లోక్ సభలో ఎంపీలపై విధించిన సస్పెన్షన్ ను ఎత్తి వేయాలని స్పీకర్ ను కోరుతున్నట్టు కావూరి సాంబశివరావు తెలిపారు. రాష్ట్రానికి చెందిన ఎంపీలు లేకుండా తెలంగాణ బిల్లుపై ఎలా చర్చిస్తారని ఆయన ప్రశ్నించారు. సీమాంధ్రకు చెందిన కేంద్రమంత్రులు రేపు, ఎల్లుండి కూడా వెల్ లోకి వెళ్లి నిరసన వ్యక్తం చేస్తారని ఆయన తెలిపారు. బిల్లులో తాము సూచించిన మార్పులను చేర్చాలని, తమ డిమాండ్లపై చర్చించిన అనంతరమే బిల్లుపై ముందుకు వెళ్లాలని ఆయన డిమాండ్ చేశారు. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే తాము ఆందోళనకు దిగుతున్నట్టు ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News