: ఆ 'మూడు' బ్యాంకులు తప్పు చేయలేదు: ఆర్ బీఐ
దేశంలోని మూడు ప్రముఖ బ్యాంకులు మనీలాండరింగ్ కు పాల్పడినట్టు వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని రిజర్వ్ బ్యాంకు నేడు స్పష్టం చేసింది. 'కోబ్రాపోస్ట్' ఆన్ లైన్ మ్యాగజైన్ స్టింగ్ ఆపరేషన్ లో వెల్లడించినట్టుగా ఆ బ్యాంకుల్లో ఎలాంటి మోసాలు జరగలేదని రిజర్వ్ బ్యాంకు డిప్యూటీ గవర్నర్ కేసీ చక్రవర్తి చెప్పారు.
'కోబ్రా పోస్ట్' స్టింగ్ ఆపరేషన్ లో హెచ్ డీఎఫ్ సీ, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకులు.. నల్లధనాన్ని ఖాతాల్లో జమచేసేందుకు అనుమతిస్తున్నాయని ఆరోపించిన సంగతి తెలిసిందే. దీంతో రిజర్వ్ బ్యాంకు వెంటనే విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో, మనీలాండరింగ్ కు సంబంధించి కుంభకోణం గానీ, అవకతవకలు గానీ ఏమీ చోటు చేసుకోలేదని కేసీ చక్రవర్తి తెలిపారు.