: ఆదుకుంటాడనుకుంటే గర్భవతిని చేశాడు!


మహారాష్ట్రలోని థానేలో దారుణం చోటు చేసుకుంది. తండ్రి తాగుబోతు కావడంతో బతుకుదెరువు కోసం మరో కుటుంబం పంచన ఆశ్రయం పొందిన బాలిక గర్భవతైంది. 60 ఏళ్ళ ఆ కుటుంబ పెద్దే ఈ నీచానికి పాల్పడ్డాడు. వివరాల్లోకెళితే.. సింధుదుర్గ్ జిల్లాకు చెందిన ఈ బాధిత బాలిక తండ్రి రోజూ తాగుతూ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశాడు. దీంతో ఆ బాలిక థానేలోని నిందితుడి కుటుంబంతో ఉంటూ చిన్న చిన్న పనులు చేసుకుంటోంది. అయితే ఈ పదమూడేళ్ళ బాలికపై ఆ కాముకుడి కన్ను పడింది. ఆమెకు మత్తు మందులు ఇస్తూ గత ఏడెనిమిది నెలలుగా రోజూ అనుభవించసాగాడు. దీంతో బాలిక గర్భం దాల్చింది.

ఈ విషయం తెలుసుకున్న బాలిక తండ్రి రంగ ప్రవేశం చేసి ఆ కామాంధుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనపై అత్యాచారం చేసేందుకు ఆ కిరాతకుడికి అతని భార్య, కుమార్తె కూడా సహకరించేవారని ఆ బాలిక వెల్లడించింది. విషయం పోలీసుల వరకూ వెళ్ళడంతో ఈ కీచక కుటుంబం పరారైంది. ప్రస్తుతం వారి కోసం గాలింపు జరుగుతోంది.

  • Loading...

More Telugu News