: ఇది మా ఆఖరి పోరాటం: అశోక్ బాబు


ఏపీఎన్జీవో నేత అశోక్ బాబు నేడు ఢిల్లీలో ఓ మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ, రేపటి మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని ధీమాగా చెప్పారు. ఇది తమ ఆఖరి పోరాటమని అభివర్ణించారు. ఈ ధర్నాకు జాతీయ పార్టీల నేతలను ఆహ్వానించామని తెలిపారు. సీఎం కిరణ్ ను కూడా ధర్నాకు పిలిచామని చెప్పారు. రాష్ట్ర విభజనకు నిరసనగా ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో ఏపీఎన్జీవోలు రేపు, ఎల్లుండి మహాధర్నా కార్యక్రమం చేపడుతున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News