: ఏపీఎన్జీవోలకు ఆహారం తీసుకెళుతున్న లారీలకు 'టి' సెగ
చలో ఢిల్లీ కార్యక్రమంలో పాల్గొనేందుకు పలు రైళ్ళలో హస్తిన బయలుదేరిన ఏపీఎన్జీవోలకు ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ సెగ తగిలింది. వారికి ఆహారం అందించేందుకు వెళుతున్న కేటరింగ్ లారీలను ఆదిలాబాద్ చెక్ పోస్టు వద్ద నిలిపివేశారు. చెక్ పోస్టు సిబ్బంది లారీ డ్రైవర్ల నుంచి సీ బుక్ లు, సెల్ ఫోన్లను బలవంతంగా లాగేసుకున్నారు. ఎట్టకేలకు ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవడంతో కొద్ది సేపటి క్రితం లారీలు ముందుకు కదిలాయి. దీనిపై ఏపీఎన్జీవో నేత విద్యాసాగర్ మాట్లాడుతూ, తమకు ఆహారం తీసుకువస్తున్న లారీలను అడ్డుకోవడం సరికాదన్నారు. 'ఎంత కష్టం ఎదురైనా ఢిల్లీ వెళతాం' అని ధీమా వ్యక్తం చేశారు. తాము ప్రయాణానికి స్లీపర్ కోచ్ లు బుక్ చేస్తే, చెక్క బల్లలున్న బోగీలను కేటాయించారని ఆయన మండిపడ్డారు.