: తొమ్మిదేళ్లకే.. 364 పుస్తకాలను చదివేసింది


ఆ పాప అందరిలా సమయాన్ని వృథా చేయదు. చక్కగా బుద్ధిగా నచ్చిన పుస్తకాలను చదివేస్తూ ఉంటుంది. చిన్నప్పుడే అలవడిన ఈ చక్కని అలవాటు కారణంగా.. తొమ్మిదేళ్లు వచ్చేసరికి 364 పుస్తకాలను పూర్తి చేసేసింది బ్రిటన్ లోని యాష్లేకు చెందిన ఫెయిత్. టీవీలా, కంప్యూటర్ గేమ్స్ లా పుస్తక పఠనం కూడా మంచి ఉత్తేజాన్ని ఇస్తుందని చెబుతోంది. జంతువులు, మేజిక్, సాహసాల పుస్తకాలను చదవడానికి ఎక్కువగా ఇష్టపడుతుందట. అలా అని దొరికిన ప్రతీ నిమిషాన్నీ పుస్తకాలు నమిలేయడానికి ఉపయోగిస్తుందనుకుంటే పొరపాటే. వారంలో నాలుగు గంటలు జిమ్మాస్టిక్స్ చేస్తుందట. అలాగే కరాటే, నెట్ బాల్ కూడా ఆడతానని అంటోంది. ఈ చిన్నారి మరో హ్యారీ పోటర్ అవుతుందేమో?

  • Loading...

More Telugu News