: క్రోమ్, ఫైర్ ఫాక్స్ వాడుతున్నారా?
గూగుల్ క్రోమ్, మొజిల్లా ఫైర్ ఫాక్స్ వెబ్ బ్రౌజర్లు వాడుతున్నారా? వీటిపై వైరస్ ఎటాక్ జరిగినట్లు వెల్లడైంది. ఈ బ్రౌజర్లలో హానికరమైన వైరస్ ను గుర్తించినట్లు కంప్యూటర్ ఎమెర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఒక ప్రకటనలో తెలిపింది. వెంటనే ఆలస్యం చేయకుండా క్రోమ్, ఫైర్ ఫాక్స్ బ్రౌజర్లను అప్ గ్రేడ్ చేసుకోవాలని సూచించింది. దేశంలో ఆన్ లైన్ భద్రతా అంశాలను కంప్యూటర్ ఎమెర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ పర్యవేక్షిస్తూ ఉంటుంది.