: చిటికెలో ఎన్నికల నామినేషన్ల దాఖలు


హడావిడిగా.. మందీ మార్భలంతో కార్లలో వచ్చి ఎన్నికల అధికారికి నామినేషన్ సమర్పించేసరికి సమయం మించిపోతే.. ఇక అంతే. అది తిరస్కరణకు గురవుతుంది. ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు. కానీ, ఇకపై ఆ బాధ తీరనుంది. ఆలస్యమైనా ఆందోళన పడకుండా చిటికెలో చివరి నిమిషంలోనూ 'ఈ నామినేషన్' దాఖలు చేస్తే సరిపోతుంది. వచ్చే లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఈ నామినేషన్ విధానాన్ని ప్రవేశపెట్టామని ఎలక్షన్ కమిషనర్ బ్రహ్మ తెలిపారు. దీనివల్ల అభ్యర్థుల సమాచారాన్ని వేగంగా పరిశీలించడం వీలవుతుందన్నారు. ఇక ఎన్నికల్లో అక్రమాలపై మొబైల్ ఫోన్ నుంచే ఫిర్యాదు చేసేందుకు వీలుగా ఎలక్షన్ వాచ్ రిపోర్టర్ అనే అప్లికేషన్ ను బ్రహ్మ రాంచీలో ప్రారంభించారు.

  • Loading...

More Telugu News