: సోషల్ సైట్లలోనూ 'సచిన్' నామస్మరణే!


ఆస్ట్రేలియాతో సిరీస్ లో భారత్ విజయాల్లో ప్రముఖ పాత్ర పోషించింది స్పిన్నర్లే అన్న సంగతి తెలిసిందే. అశ్విన్, ఓజా, జడేజా త్రయం బంతితో చేసిన మాయాజాలం కంగారూలను సుడిగుండంలో తిప్పేసింది. అయితే, సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో నెటిజన్ల మధ్య క్రికెట్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఎక్కువగా దొర్లిన పేర్లలో టీమిండియా స్పిన్నర్లది ఒక్కరి పేరూ లేదట.

అత్యధికులు, బ్యాటింగ్ దిగ్గజం సచిన్ నామస్మరణే చేశారని ప్రముఖ కంప్యూటర్ దిగ్గజం ఐబీఎమ్ నిర్వహించిన ఓ అధ్యయనం వెల్లడించింది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ వయసు పెరుగుతున్నా, వన్నె తరగడం లేదనడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి? ఆసీస్ తో మొదటి మూడు టెస్టుల సందర్భంగా క్రికెట్ అభిమానుల మధ్య ఈ సర్వే నిర్వహించారు.  

  • Loading...

More Telugu News