: పీవీ నరసింహారావుకు.. సోనియాకు మధ్య మనస్పర్థలు ఎందుకొచ్చాయి?
తెలుగువారు గర్వించదగ్గ మాజీ ప్రధాని, దివంగత పీవీ నరసింహారావు కు కాంగ్రెస్ ప్రాధాన్యం ఇవ్వకపోవడానికి కారణాన్ని పరోక్షంగా కేంద్ర ఆహార మంత్రి థామస్ ఒక పుస్తకంలో పేర్కొన్నారు. 'సోనియా, ద బిలవ్ డ్ ఆఫ్ మాసెస్' పేరుతో థామస్ ఒక పుస్తకాన్ని తీసుకొచ్చారు. అందులో సోనియా, పీవీ మధ్య సంబంధాలు చెడిపోవడానికి కారణాలను ఆయన పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ హత్య కేసు విచారణ చాలా నిదానంగా సాగుతుండడంతో సోనియా అసంతృప్తికి గురయ్యారని, ఇదే పీవీ, సోనియా మధ్య సంబంధాలు బెడిసికొట్టడానికి కారణంగా పేర్కొన్నారు.
తన భర్త హత్య కేసు దర్యాప్తులో ఆలస్యాన్ని ప్రశిస్తూ, సోనియా 1995 మే 20న రాజీవ్ జయంతికి ముందు చేసిన ప్రసంగాన్ని థామస్ తన పుస్తకంలో పేర్కొన్నారు. మాజీ ప్రధాని హత్య కేసు దర్యాప్తే ఇంత ఆలస్యమైతే.. ఇక సామాన్యుల సంగతేంటి? అంటూ నాడు సోనియా ప్రశ్నించినట్లు చెప్పారు. పీవీ అధికారంలో ఉన్నంతకాలం రాజీవ్ హత్య కేసులో పురోగతి ఉండదని ఆమె భావించినట్లు థామస్ తెలిపారు. ఆ తర్వాత రెండేళ్లకే సోనియా రాజకీయాల్లోకి వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.