: బల్కంపేట రేణుకఎల్లమ్మ గుడికి ముఖేష్ అంబానీ భార్య


హైదరాబాద్ బల్కంపేటలో కొలువై ఉన్న రేణుక ఎల్లమ్మ గుడికి రిలయన్స్ సంస్థల అధినేత ముఖేష్ అంబానీ భార్య, ముంబాయి ఇండియన్స్ యజమాని నీతా అంబానీ వచ్చారు. ఈ మధ్యాహ్నం అమ్మవారిని దర్శించుకుని సువర్ణ పుష్పార్చన,  ప్రత్యేక పూజలు జరిపారు.

ఇటీవల అమ్మవారి ఫొటోను తాను ఆన్ లైన్ లో చూశానని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.  ప్రతి ఒక్క మహిళకు తన వృత్తిని ఎంచుకునే స్వేచ్చ ఉందని, ప్రతి బాలికా విద్యావంతురాలు కావాలని నీతా ఈ సందర్భంగా ఆకాంక్షించారు. సమాజంలో మహిళను రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.       

  • Loading...

More Telugu News