: భరతమాత ముద్దుబిడ్డలను ఉగ్రవాదులుగా పేర్కొన్న బ్రిటన్ ప్రొఫెసర్


చంద్రశేఖర ఆజాద్, భగత్ సింగ్ స్వాతంత్ర్యం కోసం అలుపెరగని రీతిలో పోరాడిన భారతీయులు. వారిని అగౌరవపరిచేలా ఒక బ్రిటన్ ప్రొఫెసర్ భారత గడ్డపై వ్యాఖ్యలు చేశారు. ఇరువురూ ఉగ్రవాద మూకలకు చెందినవారుగా యూనివర్సిటీ ఆఫ్ వార్ విక్ లో హిస్టరీ ప్రొఫెసర్ డేవిడ్ హార్డిమాన్ అన్నారు. సూరత్ లోని సెంటర్ ఫర్ సోషల్ స్టడీస్ లో '1915-47 మధ్య అహింసాయుత స్వాతంత్ర్య పోరాటం' అన్న అంశంపై జరిగిన ఒక సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు.

బ్రిటిష్ పాలన నుంచి భారతావని విముక్తి కోసం భగత్ సింగ్, ఆజాద్ లు చేసిన పోరాటాన్ని ఉగ్రవాద కార్యకలాపాలుగా పేర్కొన్నారు. దీంతో సమావేశంలో కలకలం రేగింది. పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతీ అహింసా ఉద్యమం చివర్లో హింసాత్మకం అవుతుందంటూ సర్ధి చెప్పే ప్రయత్నం చేశారు. చరిత్ర ప్రొఫెసర్ అయి ఉండి అంత సిల్లీగా మాట్లాడడంపై సదస్సుకు హాజరైన వారు మండిపడ్డారు.

  • Loading...

More Telugu News