: మెరుపు సమ్మెకు సిద్ధమవుతున్న సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు
లోక్ సభలో రాష్ట్ర పునర్వ్యస్థీకరణ బిల్లు ప్రవేశపెట్టిన నేపథ్యంలో సీమాంధ్రలో మళ్ళీ తీవ్ర పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఏపీఎన్జీవోలు సమ్మె బాట పట్టగా, త్వరలోనే మెరుపు సమ్మెకు దిగేందుకు విద్యుత్ ఉద్యోగులు సమాయత్తమవుతున్నారు. సీమాంధ్ర విద్యుత్ జేఏసీ రేపు విశాఖపట్నంలో సమావేశం కానుంది. ఈ భేటీలో చర్చించి సమ్మె తేదీపై నిర్ణయం తీసుకోనున్నారు.