: చండీగఢ్ బయలుదేరిన తెలుగుదేశం పార్టీ అధినేత
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గన్నవరం విమానాశ్రయం నుంచి చండీగఢ్ బయలుదేరివెళ్లారు. ఈ రోజు చండీగఢ్ లో జరిగే రైతు సదస్సులో ఆయన పాల్గొంటారు. కాగా అంతకుముందు విజయవాడలోని డీవీ మ్యానర్ లో చంద్రబాబు పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావుతో పాటు పలువురు సీనియర్ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.