: శ్రీవారిని దర్శించుకున్న పండిట్ రవిశంకర్


తిరుమల శ్రీవారిని ఆధ్యాత్మిక గురువు, 'ఆర్ట్ ఆఫ్ లివింగ్' రవిశంకర్ ఈ రోజు ఉదయం దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్న ఆయనకు టీటీడీ అధికారులు స్వాగతం పలికి స్వామివారి తీర్ధ ప్రసాదాలను అందజేశారు. అనంతరం రవిశంకర్ మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్ధించినట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News