: శంషాబాద్ విమానాశ్రయంలో రూ.7 లక్షల బంగారం పట్టివేత
శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు శ్రీనివాస్ అనే వ్యక్తి నుంచి రూ.7 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలను పట్టుకున్నారు. దుబాయి నుంచి ఎంబ్రేడ్స్ విమానంలో హైదరాబాద్ వచ్చిన శ్రీనివాస్ విమానాశ్రయంలో అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో అధికారులు అదుపులోకి తీసుకుని, సోదా చేయగా ఈ బంగారం పట్టుబడింది. కస్టమ్స్ అధికారులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.