: బాంబు కాదు.. పాత సెల్ ఫోన్!


హైదరాబాద్ జంట పేలుళ్ళ కేసు అనంతరం ఉత్తుత్తి బాంబు బెదిరింపులు ఎక్కువయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు నకిలీ ఫోన్ కాల్ ఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి. అదిగో బాంబు అంటే, ఇదిగో బాంబు స్క్వాడ్ అన్నట్టుగా పరిస్థితి తయారైంది. ఈరోజు విశాఖలోనూ బాంబు కలకలం రేగింది. ఇక్కడి ఫ్యామిలీ కోర్టు ఆవరణలో బాంబు ఉన్నట్టు వదంతులు రేగాయి.

దీంతో, అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. సమాచారం అందుకున్న బాంబు స్క్వాడ్ హుటాహుటీన న్యాయస్థానానికి చేరుకుని తనీఖీలు ఆరంభించింది. అయితే, అక్కడ ఎలాంటి పేలుడు పదార్థాలు లభ్యం కాకపోగా, ఓ పాత సెల్ ఫోన్, రెండు బంతులు దొరికాయి. 

  • Loading...

More Telugu News