: సచిన్, ద్రావిడ్ లకు థాంక్స్ చెబుతున్న టీమిండియా క్రికెటర్


టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్ మన్ అజింక్యా రహానే క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్ లకు కృతజ్ఞతలు తెలిపాడు. నేడు న్యూజిలాండ్ తో రెండో టెస్టులో సెంచరీ సాధించిన ఈ ముంబయి బ్యాట్స్ మన్ రెండో రోజు ఆట ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడాడు. టెస్టు కెరీర్లో తొలి సెంచరీ నమోదు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. సచిన్, ద్రావిడ్ తనకు స్ఫూర్తినందించడంతో పాటు, ఆటతీరు మెరుగుపరుచుకునేందుకు తోడ్పడ్డారని తెలిపాడు.

'రాహుల్ ద్రావిడ్ నా రోల్ మోడల్. నా చిన్ననాటి నుంచి అతని ఆట చూస్తూ పెరిగాను. రాహుల్ జతగా టీమిండియాలోనూ, రాజస్థాన్ రాయల్స్ లోనూ ఆడాను. మైదానం లోపల, వెలుపల ఎలా మెలగాలో అతడిని చూసే నేర్చుకున్నా. ఇక సచిన్ పాజి నా బ్యాటింగ్ గురించి విశ్లేషిస్తాడు. కొంతకాలం నుంచి నా ఆటను, నా ఫిట్ నెస్ స్థాయిని గమనిస్తున్నట్టు సచిన్ చెప్పాడు. సహనంతో వేచి ఉంటే అవకాశాలు అవే వస్తాయని సలహా ఇచ్చాడు. ఏదేమైనా నేడు శతకం సాధించడం పట్ల ఎలా స్పందించాలో అర్థం కావడంలేదు. టెస్టుల్లో సెంచరీ అంటే ఎల్లప్పుడూ ప్రత్యేకమైనదే' అని స్పష్టం చేశాడు. ఇక టెస్టు మ్యాచ్ తీరుతెన్నులపై మాట్లాడుతూ, రేపు బౌలర్లదే భారం అని అభిప్రాయపడ్డాడు.

  • Loading...

More Telugu News