: తమిళనాడులో బెట్టింగ్ రాకెట్ గుట్టురట్టు


తమిళనాడులో్ని తిరుపూరు జిల్లాలో పోలీసులు బెట్టింగ్ రాకెట్ ను ఛేదించారు. కాంజీయం పట్టణంలో బెట్టింగ్ కు పాల్పడుతున్న ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. వెల్లింగ్టన్ లో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ పై వీరు బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేశారు. భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరు 300 దాటుతుందా? లేదా? అన్న అంశంపై ఈ ముఠా బెట్టింగ్ కు దిగింది. ప్రధాన ఏజెంటు రమేశ్ నుంచి భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News