: పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత టీడీపీదే: చంద్రబాబు
పోలవరం ప్రాజెక్టు పనులు కాంగ్రెస్ పాలనలో ముందుకు సాగటం లేదని చంద్రబాబు చెప్పారు. పోలవరం విషయంలో కాంగ్రెస్ స్పష్టమైన హామీని ఇవ్వలేకపోయిందని ఆయన విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని బాబు చెప్పారు. భవిష్యత్తులో దేశంలోని నదులను అనుసంధానించడం ద్వారా అధిక ఆయకట్టుకు నీరందించవచ్చునని ఆయన చెప్పారు. భవిష్యత్తులో నదులను అనుసంధానించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత తమదేనని చంద్రబాబు పేర్కొన్నారు.