: టీడీపీ పెట్టిన ‘దీపాన్ని’ కాంగ్రెస్ ఆర్పివేసింది: చంద్రబాబు
కాంగ్రెస్ పార్టీ పదేళ్ల పాలనలో దేశంలో అవినీతి పెరిగిపోయిందని చంద్రబాబు అన్నారు. గడచిన దశాబ్ద కాలంలో దేశంలో అన్ని సమస్యలూ మరింత పెరిగాయని ఆయన చెప్పారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే డ్వాక్రా సంఘాల రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని బాబు సభాముఖంగా ప్రకటించారు. డ్వాక్రా పొదుపు సంఘాలకు పూర్వవైభవం తీసుకువస్తామని చంద్రబాబు చెప్పారు. టీడీపీ ప్రవేశపెట్టిన ‘దీపం’ పథకాన్ని కాంగ్రెస్ ఆర్పివేసిందని ఆయన ఆరోపించారు.