: తెలుగు జాతి నిత్యం స్మరించే వ్యక్తి ఎన్టీఆర్: చంద్రబాబు
ప్రజా గర్జనకు వచ్చిన తెలుగు తమ్ముళ్లతో పశ్చిమ గోదావరి జిల్లా 'పసుపు గోదావరి జిల్లా'గా మారిపోయిందని బాబు నవ్వుతూ చమత్కరించారు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి నందమూరి తారక రామారావు అని ఆయన చెప్పారు. ఎన్జీఆర్ ను తెలుగు జాతి చిరస్థాయిగా గుర్తుంచుకుంటుందని ఆయన అన్నారు. తెలుగు వారు నిత్యం స్మరించే వ్యక్తి ఎన్టీఆరేనని బాబు చెప్పారు.
ఇటలీ నుంచి వచ్చిన సోనియాగాంధీకి రాష్ట్రంలో సమస్యలు ఎలా తెలుస్తాయని చంద్రబాబు ప్రశ్నించారు. తెలుగు వారి మధ్య విధ్వంసం సృష్టించింది సోనియాగాంధీయేనని చంద్రబాబు స్పష్టం చేశారు. వీరోచితంగా పోరాడటం తప్ప.. కుట్రలు, కుతంత్రాలు చేయడం తనకు చేతకాదని చంద్రబాబు చెప్పారు. విభజన సమస్యను సామరస్యంగా పరిష్కరించాల్సింది పోయి.. సోనియా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.