: ఆ పరంపర కొనసాగింది...భారత్ చేతిలో పాకిస్తాన్ చిత్తు!
మేజర్ క్రికెట్ టోర్నమెంట్లలో దాయాది పాకిస్థాన్ పై మనకు ఓటమన్నది లేదు. సీనియర్ టీమ్ అయినా, జూనియర్ టీమ్ అయినా అదే పరంపర. యూఏఈలో జరుగుతున్న అండర్-19 ప్రపంచకప్ లో నేడు భారత కుర్రాళ్ళు, పాకిస్థాన్ జట్టును చిత్తు చేశారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 262 పరుగులు చేయగా.. పాక్ లక్ష్య ఛేదనలో 222 పరుగులకే ఆలౌటైంది. ఆఫ్ స్పిన్నర్ ధీరజ్ హుడా 5 వికెట్లతో పాక్ వెన్నువిరిచాడు. ఓ దశలో వికెట్ నష్టపోకుండా సెంచరీ భాగస్వామ్యం నమోదు చేసిన పాక్ అనంతరం క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. పాక్ జట్టులో ఓపెనర్ సమి ఇస్లామ్ (64) టాప్ స్కోరర్. కాగా, భారత్ తన తదుపరి మ్యాచ్ ను ఎల్లుండి స్కాట్లాండ్ తో ఆడనుంది.