: సొంత నియోజకవర్గంలో పర్యటించాలని కాంగ్రెస్ యువరాజు నిర్ణయం
ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తన సొంత నియోజకవర్గం అమేథీలో పర్యటించనున్నారు. ఈ నెల 19న రాహుల్ అమేథీలో పర్యటించి పలు పథకాల అమలు తీరును పర్యవేక్షించనున్నారు. ఒక రోజు సాగే ఈ పర్యటనలో ప్రజల సమస్యలను తెలుసుకోవడంతో పాటు, పార్టీ కార్యకర్తలతోనూ సమావేశం కానున్నారు. రానున్న ఎన్నికలకు గాను వారిని సమాయత్తం చేస్తారు. రాహుల్ ప్రతినిధి చంద్రకాంత్ దూబే ఈ మేరకు వెల్లడించారు.