: రక్షణ కోసం పెప్పర్ స్ప్రే వాడుకోవచ్చని సుప్రీం కోర్టే చెప్పింది: సబ్బం హరి


అపదలో ఉన్నవారు ఎవరయినా తమ రక్షణ కోసం పెప్పర్ స్ప్రే వాడుకోవచ్చని సుప్రీంకోర్టే తీర్పునిచ్చిందని అనకాపల్లి ఎంపీ సబ్బం హరి అన్నారు. అందుకే ఆపదలో ఉన్నప్పుడు మాత్రమే ఎంపీ లగడపాటి స్ప్రేను వాడారని తెలిపారు. అలాంటప్పుడు పార్లమెంటులో దాన్ని ఉపయోగించడం తప్పుకాదన్నారు. లగడపాటి వాడిన స్ప్రే వల్ల ఎవరికీ, ఎలాంటి ఇబ్బంది కలగలేదన్నారు. దానివల్ల కాసేపు కళ్లు మండుతాయి తప్ప ఏమి కాదని వివరించారు. మహిళలు ఎక్కువగా తమ హ్యండ్ బ్యాగుల్లో పెప్పర్ స్ప్రే ఉంచుకుంటారన్నారు. ఈ రోజు విశాఖలో విలేకరుల సమావేశంలో సబ్బం మాట్లాడారు.

లోక్ సభలో ఈ నెల 8 నుంచి 10 వరకు జరిగిన సమావేశాల పుటేజ్ ఇవ్వాలని స్పీకర్ ను కోరినట్లు తెలిపారు. కాగా, సభలోనికి వెళ్లకముందే తమను సస్పెండ్ చేశారంటూ మార్షల్స్ అడ్డుకున్నారని, అసలు సభలోనికి వెళ్లకుండానే తమను ఎలా సస్పెండ్ చేస్తారని ప్రశ్నించారు. 'రాష్ట్ర విభజన అంశంపై చర్చించేందుకు మేం కాకుండా వేరే రాష్ట్రాల ఎంపీలు ఉంటారా?' అని మండిపడ్డారు. బిల్లు ఆమోదం కోసం కాంగ్రెస్ పార్టీ ఏం చేయడానికయినా సిద్ధంగా ఉందని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News