: జన్ లోక్ పాల్ పై పోరాటం ఆపం: ఏఏపీ
జన్ లోక్ పాల్ పై తమ పోరాటాన్ని ఆపమని ఏఏపీ నేత ప్రశాంత్ భూషణ్ స్పష్టం చేశారు. కేజ్రీవాల్ ప్రభుత్వం పతనం కావడానికి కాంగ్రెస్, బీజేపీలే కారణమని ఆరోపించారు. వారికి దేశం అవినీతి రహితంగా ఉండటం ఇష్టం లేదని విమర్శించారు. సభలో బిల్లును ప్రవేశపెట్టడమే కుదరనప్పుడు, అధికారంలో ఉండటంలో అర్థంలేదనే రాజీనామా చేశామని చెప్పారు.