: లూటీ కోసమే యూటీ అంటున్నారు.. మేము ఒప్పుకోం: ఎంపీ అంజన్
హైదరాబాదును యూటీ చేస్తే ససేమిరా ఒప్పుకోమని సికింద్రాబాద్ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. తమ పూర్వీకుల నుంచి ఉన్నటువంటి హైదరాబాదును యూటీ చేయడానికి ఒప్పుకోమని చెప్పారు. లూటీ చేయడానికే యూటీ అంటున్నారని తెలిపారు. సభలో సీమాంధ్ర ఎంపీలపై తెలంగాణవారు దాడులు చేయలేదని చెప్పారు. లోక్ సభలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టారని... కావాలంటే టీవీ ఫుటేజ్ చూసుకోవచ్చని సూచించారు. ఎన్ని లక్షల మంది వచ్చినా తెలంగాణ ఏర్పాటు ఆగదని చెప్పారు.