: ఏటీఎంను పగులగొట్టి మరీ.. 22 లక్షల నగదు దోచుకెళ్లారు


ఆటోమెటిక్ టెల్లర్ మెషీన్ (ఏటీఎం) ను పగులగొట్టి.. అందులోని 22 లక్షల నగదును దొంగలు దోచుకెళ్లారు. అంతేకాదు.. అక్కడున్న కంప్యూటర్ హార్డ్ డిస్క్ ను కూడా ఆగంతుకులు ఎత్తుకుపోయారు. ఈ చోరీ ఘటన హర్యానాలోని ఖైతాల్ పట్టణంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎం సెంటర్ లో జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఏటీఎం సెంటర్ కు చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. చోరీ ఘటనను పోలీసులు ధృవీకరించారు. దొంగిలించిన అనంతరం ఆగంతుకులు ఏటీఎం మెషీన్ కు నిప్పు పెట్టారని పోలీసులు చెప్పారు.

  • Loading...

More Telugu News