: అండర్-19 ప్రపంచ కప్ లో భారత్ స్కోర్ 262/7
దుబాయ్ లో జరుగుతున్న అండర్-19 ప్రపంచ కప్ క్రికెట్ పోటీల్లో ఇవాళ భారత్ -పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 262 పరుగులు చేసింది. దాంతో పాకిస్థాన్ ముందు 263 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. సర్ఫరాజ్ ఖాన్ (74), సంజూ శాంసన్ (68) అర్ధ సెంచరీలు చేశారు. అఖిల్ (41), అంకుష్ (24) రాణించారు. పాకిస్థాన్ బౌలర్లలో కరమత్ అలీ రెండు వికెట్లు, ఇర్ఫానుల్లా రెండు వికెట్లు తీశారు. జియా ఉల్-హక్, జాఫర్ చెరో వికెట్ తీశారు.