: మళ్లీ ఆడ వేషంలో అమీర్ ఖాన్!
తన చిత్రాలకు విభిన్న ప్రచారం చేయడంలో హిందీ నటుడు అమీర్ ఖాన్ ఎప్పుడూ ముందుంటారన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే పలు వేషాలతో అభిమానులను ఆకట్టుకుంటుంటారు. తాజాగా అమీర్
ఓ బ్రాండ్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు. విశేషం ఏమిటంటే, దీని ప్రకటనలో ఆయన ఆడవేషంలో కనిపించబోతున్నారు.
దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు అంతర్జాలంలో (నెట్) విడుదలయి హల్ చల్ చేస్తున్నాయి. 1995లో 'బాజీ' చిత్రంలోని ఓ పాటలో అమీర్ స్త్రీ వేషంలో కనిపించి అలరించారు. మళ్లీ ఇన్ని రోజుల తర్వాత ఈ 48 సంవత్సరాల నటుడు మహిళ వేషంలో కనిపించేందుకు సిద్ధమయ్యారు. గతంలో అమీర్ రెండు ప్రకటనల్లో ఇలానే కనిపించి ఆకట్టున్నాడు.