: తెలంగాణ బిల్లును ఆపాలని సీమాంధ్రులు కుట్ర పన్నారు: కోదండరాం
తెలంగాణ బిల్లును ఎలాగైనా ఆపాలని సీమాంధ్రులు కుట్ర పన్నారని తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ కోదండరాం ఆరోపించారు. అందుకే సీమాంధ్ర ఎంపీలు పార్లమెంటులో హింసకు పాల్పడ్డారని ఆయన విమర్శించారు. తెలంగాణలో యువకుల ఆత్మబలిదానాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. ఆత్మబలిదానాలను ఆపాలంటే.. తెలంగాణ బిల్లును తక్షణమే ఆమోదించాలంటూ డిమాండ్ చేశారు.