: ప్రత్యేక రైళ్లు అనుమతించడం సమంజసం కాదు: టీఆర్ఎస్ నేత వినోద్
ఢిల్లీలో సీమాంధ్రుల ధర్నాకు ప్రత్యేక రైళ్లను అనుమతించడం సమంజసం కాదని టీఆర్ఎస్ నేత వినోద్ అన్నారు. ఈ క్రమంలో ఢిల్లీలో హింసాత్మక ఘటనలకు పాల్పడితే తెలంగాణ, సీమాంధ్రలో దాని ప్రభావం ఉంటుందని హెచ్చరించారు. సీమాంధ్రుల ధర్నాకు ఇచ్చిన అనుమతిని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విభజన బిల్లుపై సోమ, మంగళ వారాల్లో ఉభయసభల్లోనూ చర్చ జరగాలని కోరారు.