: విభజన ఆగితే యుద్ధమే: కోమటిరెడ్డి
టీబిల్లును పార్లమెంటులో ప్రవేశపెడితే రాజీనామా చేస్తానన్న సీఎం కిరణ్ ఇంకా ఎందుకు రాజీనామా చేయలేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. అభినవ అఫ్జల్ గురులు ఎంతమంది వచ్చినా తెలంగాణ ఆగదని... ఒకవేళ ఆగితే యుద్ధమే అని హెచ్చరించారు. 'మా రాష్ట్రాన్ని దోచుకున్నది ఇక చాలు' అన్నారు. ఈ రోజు ఆయన సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.