: ఏపీఎన్జీవోల 'చలో ఢిల్లీ' కార్యక్రమానికి ప్రత్యేక రైళ్లు


ఏపీఎన్జీవోలు పిలుపునిచ్చిన 'చలో ఢిల్లీ' కార్యక్రమానికి రాష్ట్రం నుంచి ఆరు ప్రత్యేక రైళ్లు వెళ్లనున్నాయి. ఇప్పటికే రేణిగుంట నుంచి ఢిల్లీకి ఏపీఎన్జీవోల ప్రత్యేకరైలు బయలుదేరింది. మధ్యాహ్నం ఒంటిగంటకు అనంతపురం నుంచి, 2 గంటలకు కాకినాడ నుంచి, 4 గంటలకు నెల్లూరు నుంచి, 8 గంటలకు గుంటూరు, విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు బయలుదేరనున్నాయి. దాంతో, 17,18 తేదీల్లో చేపట్టనున్న బహిరంగ సభకు పెద్ద సంఖ్యలోనే ఏపీఎన్జీవోలు, విద్యార్థులు, సమైక్యవాదులు బయలుదేరి వెళుతున్నారు. దాదాపు 12 వేల మందికి పైగా సమైక్యవాదులు ఢిల్లీ చేరుకుంటున్నారని సమాచారం. విభజనను ముమ్మాటికీ జరగనివ్వమని ఢిల్లీ వెళ్లున్నవారు అంటున్నారు.

  • Loading...

More Telugu News