: సీమాంధ్ర ఎంపీలను దేశం నుంచి బహిష్కరించాలి: నాగం


సీమాంధ్రుల కోసం ప్రత్యేక పార్లమెంటును ఏర్పాటు చేయాలని సీమాంధ్ర ఎంపీలు డిమాండ్ చేయడంపై బీజేపీ నేత నాగం జనార్ధన్ రెడ్డి మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన సీమాంధ్ర ఎంపీలను దేశం నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. రాంలీలా మైదానంలో జరిగే ర్యాలీకి వేలాదిగా సీమాంధ్రులు తరలివస్తున్నారని... వీరి సభకు ఢిల్లీలో పర్మిషన్ ఇవ్వరాదని సూచించారు. పార్లమెంటులో జరిగిన ఉదంతాన్ని గుర్తుంచుకోవాలని... వీరిని ఢిల్లీలో అడుగుపెట్టనిస్తే మరింత అనర్థం తలెత్తుతుందని చెప్పారు.

  • Loading...

More Telugu News