: పొత్తా, విలీనమా.. కాంగ్రెస్ పార్టీ అభిప్రాయంపై ఆధారపడి ఉంటుంది: టీఆర్ఎస్


విభజన ప్రక్రియ చివరి అంకానికి చేరినప్పటికీ... తెలంగాణ వాదుల్లో పూర్తి స్థాయి నమ్మకం మాత్రం కుదరలేదు. సమావేశాలకు ఇంకా ఐదు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉందని... బిల్లు పాస్ అవుతుందో? లేదో? చెప్పలేని పరిస్థితి నెలకొందని టీఆర్ఎస్ నేత వినోద్ అభిప్రాయపడ్డారు. అదే సమయంలో బిల్లు పూర్తి మెజారిటీతో పాస్ అవుతుందనే ఆశాభావం కూడా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తా, విలీనమా? అనే విషయం కాంగ్రెస్ అభిప్రాయాలతో ముడిపడి ఉంటుందని చెప్పారు. ఈ రోజు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజనతోనే టీఆర్ఎస్ బాధ్యత తీరిపోదని... రాష్ట్ర పునర్నిర్మాణంలోనూ టీఆర్ఎస్ పాలుపంచుకోవాలని తెలంగాణ ప్రజలు కోరుతున్నారని వినోద్ చెప్పారు. రాంలీలా మైదానంలో జరిగే సీమాంధ్రుల ర్యాలీకి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వరాదని... ఈ ర్యాలీతో ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్రిక్తత నెలకొనే అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News