: ప్రధానిగా ఎవరిని ఎన్నుకున్నా కలసి పనిచేస్తాం: యూఎస్
లోక్ సభ ఎన్నికల్లో ప్రధానిగా భారతదేశ ప్రజలు ఎవరిని ఎన్నుకున్నా కలిసి పనిచేస్తామని అగ్రరాజ్యం అమెరికా చెబుతోంది. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీతో పనిచేయడానికి అమెరికా సిద్ధంగా ఉందా? అన్న ప్రశ్నకు... యూఎస్ స్టేట్ డిపార్ట్ మెంట్ డిప్యూటీ అధికార ప్రతినిధి మేరీ హార్ఫ్ పైవిధంగా సమాధానం ఇచ్చారు. అయితే, రెండు రోజుల కిందట గుజరాత్ లోని గాంధీనగర్ లో మోడీని అమెరికా రాయబారి నాన్సీ పావెల్ కలవటం.. సార్వత్రిక ఎన్నికల ముందు భారత్ లోని ప్రధాన రాజకీయ నేతలతో చర్చలు జరపడంలో ఓ భాగమే అని పేర్కొన్నారు.