: ఔను..వాళ్ళిద్దరూ పారిపోయారు!


వెయ్యి కోట్ల మోసానికి పాల్పడిన బెంగళూరుకు చెందిన నటి లీనా, సుహాస్ చంద్రశేఖర్ అరెస్ట్ అయి బెయిల్ పై విడుదలయ్యారు. ఆ తర్వాత వారు పోలీసులకు కూడా కనిపించకుండా పోయారు. వీరిద్దరూ కర్ణాటక ప్రభుత్వం పథకాల అమలుకు అవసరం అయిన ఆహార సదుపాయాల నిర్వహణకు ఉద్యోగులు అవసరం అంటూ, అమాయకుల్ని, పలు సంస్థలను మోసం చేసి వందలాది కోట్లు కొల్లగొట్టిన కేసులో అరెస్ట్ అయిన విషయం విదితమే. గత ఏడాది ఢిల్లీలోని ఓ అతిథి గృహంలో ఢిల్లీ పోలీసులు నటి లీనాను అరెస్ట్ చేసి చెన్నై పోలీసులకు అప్పగించారు. ఆ తర్వాత గతేడాది జులైలో సుహాస్ చంద్రశేఖర్ ను కోల్ కతాలో పోలీసులు అరెస్ట్ చేశారు. నటి లీనా, సుహాస్ చంద్రశేఖర్ లను చెన్నై పోలీసులు విచారించి జైలుకు తరలించారు. వీరిద్దరూ, ఆ తర్వాత షరతులతో కూడి బెయిల్ పై విడుదలయ్యారు. ఇప్పుడు, వారు పరారవ్వడంతో పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వీరిద్దరూ కోల్ కతాకు పారిపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా కేసు విచారణను కొనసాగిస్తున్నారు.

  • Loading...

More Telugu News