: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మానాన్ని గౌరవించాలి: 'ఆర్ట్ ఆఫ్ లివింగ్' రవిశంకర్


కేంద్రం ప్రభుత్వం ఏకపక్షంగా, అహంకార పూరితంగా వ్యవహరిస్తూ, ఆంధ్రప్రదేశ్ విభజనకు ఆగమేఘాల మీద సిద్ధమవుతోందని, ఇది మంచిది కాదని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ అభిప్రాయపడ్డారు. విభజనను వ్యతిరేకిస్తూ రాష్ట్ర శాసనసభ తీర్మానం చేసినప్పటికీ కేంద్రం మొండిగా ముందుకు వెళుతుండడాన్ని ఆయన తప్పుపట్టారు. ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ ద్వారా అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన రవిశంకర్ హైదరాబాదులో మీడియాతో మాట్లాడారు.

రాష్ట్ర విభజనపై రవిశంకర్ అభిప్రాయాలు ఆయన మాటల్లోనే.. "కేంద్రంలోని పాలకులు ఆంధ్రప్రదేశ్ ప్రజల మధ్య వైషమ్యాలను పెంచేశారు. కేవలం కొందరి స్వార్థం కోసం విభజనకు పూనుకోవడం విచారకరం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మానాన్ని గౌరవించాలి. దీనిని తోసిపుచ్చి విభజనపై ముందుకెళ్లడం సరైనది కాదు. హడావుడిగా తీసుకునే నిర్ణయాలు ఏవైనా.. చివరకు వృథాగా మారతాయి. ఈ చర్యల ద్వారా రాష్ట్రాన్ని, దేశాన్ని మరో 50 ఏళ్లు వెనక్కి తీసుకువెళ్ళినట్టే అవుతుంది. నా వ్యాఖ్యలతో వివాదాలు రేగినా వెనుకాడను. పార్లమెంటులో గురువారం నాటి ఘటన కేంద్రం తప్పిదం వల్లే జరిగింది. చివరకు సొంత మంత్రుల మాటకు కూడా విలువ లేకుండా పోయింది. కొంతకాలంగా అభివృద్ధి ఆగిపోయి.. ఆంధ్రప్రదేశ్ పూర్తిగా స్తంభించిపోయింది. దేశంలో పాలన చచ్చుబడిపోయి.. ఆర్థిక వ్యవస్థ వెంటిలేటర్ పై ఉంది. ఈ పరిస్థితుల్లో సుస్థిర ప్రభుత్వం అవసరం. దేశాన్ని, రాష్ట్రాన్నీ పరిపాలించడానికి సమర్థులైన పాలకులు అవసరం."

  • Loading...

More Telugu News