: హడావుడిగా బిల్లును పెట్టి.. ఇప్పుడు బీజేపీపై అభాండాలు ఏమిటి?: వెంకయ్యనాయుడు


తొమ్మిదిన్నర ఏళ్లుగా సభలో నిద్రపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇటీవలనే అంటే రెండు నెలల క్రితమే మేల్కొందని బీజేపీ జాతీయ నేత వెంకయ్యనాయుడు అన్నారు. తొమ్మిదిన్నర ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ విభజన ప్రక్రియను చేపట్టలేదని తెలిపారు. కనీసం తమ సొంత పార్టీ ఎమ్మెల్యేలను కూడా విభజనకు ఒప్పించలేకపోయిందని ఆయన చెప్పారు. విభజన బిల్లును సభలో ప్రవేశపెట్టే విషయంలోనూ కాంగ్రెస్ పార్టీ సరిగ్గా వ్యవహరించలేదని ఆయన అన్నారు. బిల్లు ప్రవేశపెట్టలేదని విపక్ష సభ్యులు అంటుంటే.. ప్రవేశపెట్టామని కాంగ్రెస్ చెబుతోందన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు అజెండా ఖరారు చేసి 12 గంటలకే లోక్ సభలో బిల్లు ప్రవేశపెట్టడమేంటని, దీనిపై స్పీకర్ మీరాకుమార్, కేంద్ర ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. సభలో హడావుడిగా బిల్లు ప్రవేశపెట్టి.. ఇప్పుడు ప్రతిపక్ష సభ్యుల మీద అభాండాలు వేస్తున్నారని, ఆయన అన్నారు. కాంగ్రెస్ చౌకబారు రాజకీయాలను దేశప్రజలందరూ గమనిస్తున్నారని వెంకయ్యనాయుడు చెప్పారు.

రాష్ట్రాన్ని విభజించే ముందు, ఇరు ప్రాంతాల వారిని కూర్చోబెట్టి మాట్లాడి.. సీమాంధ్ర సమస్యలను పరిష్కరించే బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన చెప్పారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ పెద్దలైన అహ్మద్ పటేల్, దిగ్విజయ్ సింగ్ లను కలిసి చెప్పామని ఆయన అన్నారు. అయితే.. వారు అంతా విని ఆలోచిస్తామన్నారే గాని, ఆచరణలోకి తెచ్చింది లేదని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News