: తేడా వస్తే ఇక యుద్ధమే!: ఢిల్లీలో టీజేఏసీ నేతలు
విభజన ప్రక్రియ తుది అంకానికి చేరుకోవడంతో ఇరు ప్రాంతాలకు చెందిన ఉద్యోగ సంఘాల నేతలంతా ఢిల్లీలోనే మకాం వేశారు. ఈ నేపథ్యంలో టీజేఏసీ నేతలు మీడియాతో మాట్లాడారు. ఇకపై రాష్ట్రం కలిసి ఉండటం ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదని కోదండరాం తెలిపారు. ఒకవేళ కలసి ఉన్నా హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటాయని చెప్పారు. మరో నేత దేవీప్రసాద్ మాట్లాడుతూ, సీమాంధ్రులకు ధనబలం, అంగ బలం ఉన్నప్పటికీ... మాకు బలమైన ఆకాంక్ష ఉందని... దీంతో అంతిమ విజయం సాధిస్తామని అన్నారు. కిరణ్, చంద్రబాబు, జగన్ లు తెలంగాణ ఆకాంక్షను అడ్డుకుంటున్నారని విమర్శించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏదైనా తేడా వస్తే, యుద్ధమే అని హెచ్చరించారు. సీమాంధ్ర నేతల కుట్రలను తిప్పికొడతామని తెలిపారు. మరోనేత శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, ఏపీఎన్జీవోలు రాంలీలా మైదానంలో చేపడుతున్న ర్యాలీకి... గొడవలు చేసే వారు కూడా వస్తున్నారని ఆరోపించారు.