: తిరుమల నడకదారి భక్తులపై సైకో దాడి
తిరుమల నడకదారి భక్తులపై ఓ సైకో వీరంగం సృష్టించాడు. ఈ ఉదయం నడకదారిన భక్తులు వెళుతుండగా ఒక్కసారే చెట్ల పొదల్లోంచి వచ్చి కర్రలతో విచక్షణా రహితంగా దాడి చేశాడు. రాళ్లు కూడా విసిరాడు. ఆ ఘటనలో నలుగురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. వెంటనే వారిని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. ఘటన సమయంలోనే భక్తులు సైకోను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాధితులందరూ చెన్నైకి చెందిన వారని పోలీసులు చెప్పారు. మహిళలను లక్ష్యంగా చేసుకునే సైకో దాడికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.