: అందరూ ఢిల్లీ రండి.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ పిలుపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున ఢిల్లీ వెళ్తున్నాను... తెలంగాణ రాష్ట్రం తరపునే తిరిగి వస్తానన్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హస్తినలో వ్యూహరచన చేస్తున్నారు. కీలక నేతలందరితో చర్చలు జరుపుతున్నారు. ఈసారి తెలంగాణ రాకపోతే ఇకపై కష్టమే అన్న భావనలో ఆయన ఉన్నారు. దీంతో బిల్లు ఆమోదం పొందేంతవరకు పూర్తి అప్రమత్తతతో ఉండాలని తన పార్టీ శ్రేణులను హెచ్చరించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ వెంటనే ఢిల్లీ రావాలని ఆదేశాలు జారీచేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి రాజకీయ నిర్ణయానికైనా సిద్ధంగా ఉండాలని పార్టీ నేతలను సన్నద్ధం చేశారు.