: 1993 ముంబై పేలుళ్లకేసు తీర్పు విడుదల, యాకూబ్ కు ఉరిశిక్ష
1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ప్రధాన నిందితుడైన యాకుబ్ మెమన్ కు ఉరిశిక్షను ఖరారు చేస్తూ అత్యున్నత న్యాయస్థానం తన తీర్పునిచ్చింది. (యాకుబ్ ఈ ఘటనకు ప్రధాన సూత్రధారి టైగర్ మెమన్ సోదరుడు), ఈ కేసుతో సంబంధం ఉన్న మరో 10 మందికి టాడాకోర్టు విధించిన ఉరిశిక్షను, సుప్రీం జీవిత ఖైదుగా మార్చింది. ఈ దాడిలో పాకిస్తాన్ హస్తముందని కూడా అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది..
నిందితులందరికీ పాకిస్థాన్ లో ఐఎస్ఐ శిక్షణ నిచ్చినట్టు సుప్రీం కోర్టు తన తీర్పులో పేర్కొంది. దుండగులు ఇస్లామాబాద్ విమానాశ్రయం నుంచి వెళ్లేందుకు తనిఖీలు చేయకుండా ఐఎస్ఐ సహకరించిందని కూడా కోర్టు వెల్లడించింది. ప్రధాన సూత్రధారి టైగర్ మెమన్, దావూద్ ఇబ్రహీం తప్పించుకు తిరుగుతున్నారని సుప్రీం పేర్కొంది.
ఇంతకు ముందు 2006లో టాడా కోర్టు ఇచ్చిన తీర్పుమీద సుప్రీంకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. దాదాపు 20 ఏళ్ల క్రితం అంటే, 1993 మార్చి12న జరిగిన ఈ ఘోరఖలిలో 255 మంది ప్రాణాలు కోల్పోగా, 713 మంది గాయాల పాలయ్యారు. భారీగా ఆస్తినష్టం జరిగింది. గతంలో టాడాకోర్టు ఇచ్చిన తీర్పుమీద కొందరు సుప్రీంను ఆశ్రయించిన నేపధ్యంలో ఈ తీర్పు వెలువడింది.

- Loading...
More Telugu News
- Loading...