: లగడపాటిపై అట్రాసిటీ కేసు పెట్టాలంటున్న మాజీ మంత్రి
మాజీ మంత్రి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్రావు మరోసారి మీడియా ముందుకు వచ్చారు. నిన్న లోక్ సభలో పెప్పర్ స్ప్రేతో గందరగోళం సృష్టించిన విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లగడపాటి దళిత స్పీకర్ మీరాకుమార్ ను అవమానించే రీతిలో ప్రవర్తించాడని శంకర్రావు ఆరోపించారు. ఇతర సీమాంధ్ర ఎంపీలు కూడా లగడపాటి తరహాలోనే స్పీకర్ ను కించపరిచారని పేర్కొన్నారు. ఇక పనిలో పనిగా శంకర్రావు సీఎం కిరణ్ పైనా ధ్వజమెత్తారు. లోక్ సభలో బిల్లు ప్రవేశపెడితే పదవికి రాజీనామా చేస్తానని చెప్పిన సీఎం, ఇప్పుడు పదవికి ఎందుకు రాజీనామా చేయడంలేదని ప్రశ్నించారు.